: ఢిల్లీ కోర్టులో రాజా, కనిమొళిల బెయిల్ పిటిషన్లు
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ టెలికాం మాజీ మంత్రి ఏ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, మరో ఏడుగురు నిందితులు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు న్యాయస్థానంలో తమ పిటిషన్లు దాఖలు చేశారు. పరిశీలించిన న్యాయస్థానం 28కి విచారణ వాయిదా వేసింది. ఈ కేసులోనే మనీ లాండరింగ్ కింద నిందితులందరిపై ఈడీ ఇప్పటికే చార్జిషీట్ నమోదు చేసింది.