: ఇరుదేశాల స్నేహాన్ని పాక్ కోరుకుంటోంది: నవాజ్ షరీఫ్
శాంతి సందేశంతో భారత్ వెళ్తున్నానని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. భారత్ బయల్దేరే ముందు ఇస్లామాబాద్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాక్ ప్రజలు ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను కోరుకుంటున్నారని తెలిపారు. కాసేపటి క్రితమే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన శ్రీమతి కుల్సుమ్ నవాజ్, కుమారుడు హుస్సేన్ నవాజ్ లు కూడా భారత్ విచ్చేశారు.