: రాష్ట్రపతి భవన్ కు రానున్న బాలీవుడ్ ప్రముఖులు
మోడీ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు రాష్ట్రపతి భవన్ కు క్యూకట్టనున్నారు. సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమితాబ్, లతా మంగేష్కర్, రేఖ హాజరుకానున్నారని సమాచారం. సల్మాన్ ఖాన్ కు కూడా ఆహ్వానం వెళ్లింది. ఎన్నికలకు ముందు సల్మాన్, లత ఇద్దరూ మోడీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. సచిన్ టెండుల్కర్ కూడా హాజరుకావచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే రాజ్యసభ, లోక్ సభ సభ్యులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. అలాగే, మాజీ రాష్ట్రపతులు ప్రతిభాపాటిల్, అబ్దుల్ కలాంను కూడా ఆహ్వానించారు.