: టీడీపీ మహానాడుకి 20వేల మంది వస్తున్నారు
తెలుగుదేశం పార్టీ హైదరాబాదు శివారు గండిపేటలో రెండు రోజుల పాటు మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రేపు, ఎల్లుండి జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి 20వేల మంది వస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. పార్టీ అభిమానులు, నేతలు, కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. ఇటీవలి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఘనవిజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మహానాడును ఘనంగా జరుపనున్నారు.