: కారూ, ఆటో కాని.. నాలుగు చక్రాల నవీన వాహనం


నాలుగు చక్రాలుంటాయి గానీ.. కారు కాదు. లీటరుకు 35 కిలోమీటర్లు ఇస్తుందిగానీ స్కూటరు కాదు. రూపం కొంచెం దగ్గరగా కనిపించినా.. అది ఆటో కూడా కాదు. అందుకే దానికంటూ ఓ కొత్తవిభాగం పేరుపెట్టాలని కేంద్రప్రభుత్వం అనుకుంటూ ఉంటే.. విభాగం వచ్చిన తర్వాతే.. దాన్ని మార్కెట్‌ లోకి తేవాలని తయారీదార్లు అనుకుంటున్నారు.

బజాజ్‌ ఆటో సంస్థ తాజాగా నాలుగు చక్రాల క్వాడ్రాసైకిల్‌ అనే వాహనాన్ని మార్కెట్లోకి తెస్తోంది. ఔరంగాబాద్‌లో వీటిని ఉత్పత్తి చేయబోతున్నారు. ఇది చూడ్డానికి కారులాగే ఉంటుంది. అయితే ఆ కేటగిరీలోకి రాదు. ప్రస్తుతానికి దీన్ని ఆర్‌ఈ`60 అంటున్నారు. ఈ వాహనాన్ని ఏ కేటగిరీలో చేర్చాలో ప్రభుత్వం తేల్చిన తర్వాత.. ధర తదితర వివరాలు వెల్లడించాలని బజాజ్‌ భావిస్తోంది.

సుమారు లక్ష, రెండు లక్షల మధ్య అందుబాటులోకి రాగల ఈ వాహనం నానోకు పోటీ కాగలదని మాత్రం చూసిన వారు అంటున్నారు.

  • Loading...

More Telugu News