: 1200 ఏళ్ల క్రితమే కంప్యూటర్ వాడారా?


ఈవేళ కంప్యూటర్ అన్నది మన దైనందిన జీవితంలో భాగమైపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరం ప్రతి దానికీ దీనిపైనే ఆధారపడిపోతున్నాం. అయితే, షాకింగ్ న్యూస్ ఏమిటంటే, మన పూర్వీకులు కూడా కంప్యూటర్లు వాడారట! ఇందుకు తాజాగా ఆధారాలు లభించాయి. సుమారు 1200 సంవత్సరాల క్రితం నాటి చెక్కతో తయారైన ఓ కంప్యూటర్ లాంటి వస్తువు ఇప్పుడు వెలుగుచూసింది.

టర్కీ రాజధాని ఇస్తాంబుల్ సమీపంలోని ఎనికపీ ప్రాంతంలో మునిగిపోయిన ఓ పురాతన నౌకలో ఈ చెక్క కంప్యూటర్ ను పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నేడు మనం వాడే ఏడంగుళాల అధునాతన ట్యాబ్లెట్ కంప్యూటర్ ను ఇది పోలి వుందని చెబుతున్నారు. ఇది ఓడ కెప్టెన్ కు చెందినదిగా భావిస్తున్నారు.

ఈ నౌక 9వ శతాబ్దానికి చెందినదిగా, అక్కడి ఓడరేవును నాలుగవ శతాబ్దంలో నిర్మించినట్టుగా శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఇక్కడి నౌకలు నల్ల సముద్రం మీదుగా క్రిమియా నుంచి కెర్సొనిసస్ కు సరుకులను రవాణా చేసేవట. కాగా, ఈ చెక్క కంప్యూటర్ ను ఎలా తయారు చేశారు? అది ఎలా పనిచేసేది? వంటి విషయాలపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు.

  • Loading...

More Telugu News