: నేడే మోడీ ప్రమాణస్వీకారం... భద్రతా వలయంలో న్యూఢిల్లీ
భారతదేశ 15వ ప్రధానమంత్రిగా 63 ఏళ్ల నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ ముందు భాగంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వేడుకలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సహా సార్క్ దేశాల అధిపతులు, సుమారు మూడువేల మంది దేశ, విదేశీ ప్రతినిధులు, అతిథులు ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. మోడీ తల్లి హిరాబెన్ కూడా రావచ్చని తెలుస్తోంది. ప్రమాణస్వీకారం నేపథ్యంలో మోడీ ఈ రోజు ఉదయం 7.30 గంటలకు మహాత్మగాంధీ సమాధి రాజ్ ఘాట్ ను సందర్శించి నివాళులర్పిస్తారు. దేశంలోని రాజకీయ, వ్యాపార ప్రముఖులు, వివిధ దేశాల అధినేతలు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి హోం శాఖ కనీవినీ ఎరుగని రీతిలో భద్రత ఏర్పాట్లు చేసింది.