: పార్టీ వీడాలనుకునే వారు పదవులకు రాజీనామాలు చేయాలి: మేకపాటి
తమ ఎంపీలు టీడీపీలో చేరడంపై వైకాపా నేతలు మండిపడుతున్నారు. పార్టీలు మారాలనుకునేవారు ముందుగా పార్టీకి, పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలుపొందాలని వైకాపా ఎంపీ మేకపాటి సవాల్ విసిరారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చాల్సిన శుభసమయంలో... చంద్రబాబు అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ టీడీపీకి ఉన్నప్పుడు... తమ ఎమ్మెల్యేలు, ఎంపీలతో అవసరమేముందని ప్రశ్నించారు. కొద్ది రోజుల్లోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుందని... రుణాలు మాఫీ చేస్తారని రైతులు ఎదురు చేస్తున్నారని... వారిని ఆదుకోవాలని సూచించారు.