: నాలుగైదు రోజులు ఓపిక పట్టండి... విద్యుత్ ఉద్యోగులకు సీఎస్ విజ్ఞప్తి


మే 21నే పీఆర్సీకి సంబంధించిన నివేదిక అందిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి తెలిపారు. పీఆర్సీ వల్ల రూ. 1250 కోట్ల అదనపు భారం పడుతుందని... ఉమ్మడి ఖాతా నుంచి ఇంత సొమ్మును ఇప్పుడు వెచ్చించలేమని స్పష్టం చేశారు. జూన్ 2న కానీ, ఆ తర్వాత కానీ కొత్తగా కొలువుదీరే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు పీఆర్సీ ఫైలును అందజేస్తామని చెప్పారు. అందువల్ల ఈ నాలుగైదు రోజులు ఓపికపట్టాలని విద్యుత్ ఉద్యోగులకు సూచించారు. మండువేసవిలో ఇలాంటి సమ్మెలకు దిగడం సమంజసం కాదని అన్నారు. అందువల్ల, కొత్త ప్రభుత్వాలు వచ్చేంత వరకు సంయమనం పాటించాలని ఉద్యోగులకు మహంతి సూచించారు.

  • Loading...

More Telugu News