: టీడీపీకి ఒకటే కేంద్ర మంత్రి పదవి: హరిబాబు
కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి ఒకటే మంత్రి పదవి ఇవ్వనున్నట్లు బీజేపీ సీమాంధ్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ హరిబాబు చెప్పారు. భాగస్వామ్య పార్టీలకు ఒక్కో మంత్రి పదవి మాత్రమే ఇవ్వాలని మోడీ నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో టీడీపీ సీనియర్ నేత అశోకగజపతి రాజుకు మంత్రి పదవి దక్కవచ్చని భావిస్తున్నారు.