: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అనూహ్య సంఖ్యలో భక్తులు పోటెత్తుతుండడంతో దర్శనానికి వేచి ఉండే సమయం బాగా పెరిగిపోయింది. ధర్మదర్శనం కోసం 30 గంటలు, కాలినడకన వచ్చే వారికి 18 గంటలు, ప్రత్యేక దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. టీటీడీ జేఈవో క్యూలైన్లను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై శని, ఆదివారాల్లో కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు.