: ఎవరెస్ట్ ను అధిరోహించిన విద్యార్థులకు బాబు అభినందనలు
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రాష్ట్ర విద్యార్థులు పూర్ణ, ఆనంద్ లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాల విద్యార్థిని పూర్ణ(14), ఖమ్మం జిల్లా గురుకుల పాఠశాల విద్యార్థి ఆనంద్(17) ఈ ఉదయం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి భారత పతాకాన్ని ఎగురవేయడంతో వారిని చంద్రబాబు అభినందించారు.