: టీడీపీలో చేరిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ ఎస్పీవై రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరారు. ఢిల్లీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు ఎంపీ రేణుక భర్త కూడా చంద్రబాబును కలుసుకోవడంతో ఆమె కూడా టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.