: బాబుతో భేటీకానున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బుట్టా రేణుక


ఎన్నికల్లో హోరాహోరీ పోరాడి ఓటమి పాలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. రాయలసీమ ప్రాంతంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్తగా పేరొందిన నంద్యాల నంది పైపుల అధినేత, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబును ఢిల్లీలో కలుసుకుని చర్చించడం సంచలనం కలిగించింది. జగన్ తో భేదాభిప్రాయాల వల్లే ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరాలనుకుంటున్నట్లు సమాచారం. అలాగే, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా చంద్రబాబును కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇస్తే వీరిద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ ను వీడి సైకిల్ ఎక్కే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News