: కేంద్ర మంత్రి పదవులపై టీడీపీ సీనియర్ నేతలతో బాబు చర్చలు
కేంద్ర మంత్రి వర్గంలో టీడీపీకి ఇచ్చే మంత్రి పదవుల సంఖ్యపై స్పష్టత రావడంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. మోడీతో చంద్రబాబు సమావేశంలో టీడీపీకి ఒక కేబినెట్, మూడు సహాయ మంత్రి పదవులు ఇచ్చేందుకు ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో ఎవరికి చోటు కల్పించాలన్న విషయమై చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలైన యనమల రామకృష్ణుడు, సుజనా చౌదరి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.