: విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ఉత్పత్తికి అంతరాయం


పీఆర్సీ అమలు కోరుతూ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో పలు చోట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. విజయవాడలోని ఎన్టీటీపీఎస్ లో మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం జిల్లా కేటీపీఎస్ ఐదు, ఆరవ దశల ప్లాంట్ల వద్ద ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. దీంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి విద్యుత్ కేంద్రం వద్ద కూడా ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఇక కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో ఉన్న ఆర్ టీపీపీ లో సాంకేతిక లోపం కారణంగా 210 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News