: నరేంద్రుడి ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ భద్రత
ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో మోడీ ప్రమాణం చేయనున్నారు. దీనికి దేశ, విదేశాల నుంచి 3,500 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో 7వేల మంది ఢిల్లీ పోలీసులను భద్రత కోసం నియమించారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం దగ్గర, రాష్ట్రపతి భవన్ ఆవరణ, దాని వెలుపల పోలీసులు కాపలాగా ఉండనున్నారు. గణతంత్ర దినోత్సవానికి వలే బ్లాక్ క్యాట్ కమోండోలు, ఎయిర్ డిఫెన్స్ గన్స్ ను రంగంలోకి దించుతున్నారు.