: విజయవాడలోని ఎన్ టీటీపీఎస్ లో నిలిచిన విద్యుదుత్పత్తి
విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. పెంచిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఆకస్మిక సమ్మెకు దిగారు. దీంతో ఇక్కడి కేంద్రంలోని మూడు యూనిట్లలో 1740 మెగావాట్ల విద్యుదుత్పత్తికి బ్రేక్ పడింది. ఇది కరెంటు కోతలపై ప్రభావం చూపనుంది.