: వార్ రూమ్ అంటే అర్థం ఏమిటో?: టీడీపీ నేత వర్ల రామయ్య
వార్ రూమ్ అంటే అర్థం ఏమిటో తనకు తెలియదని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఇవాళ ఓ టీవీ ఛానల్ లో చర్చలో పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ పార్టీ వార్ రూమ్ ఏర్పాటు చేయడంలో అర్థం లేదని అన్నారు. అసలు వార్ రూమ్ కు అర్థం డిక్షనరీలోనే లేదన్నారు. సమస్యలు పరిష్కరించేందుకో, ప్రజా సమస్యల గురించి కూర్చుని మాట్లాడటానికో వార్ రూమ్ అని పేరు పెట్టడమే సరికాదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు.