: తెలంగాణ వచ్చాక పక్క రాష్ట్రాలతో మాకు పనేంటి?: స్వామిగౌడ్


తెలంగాణ వచ్చాక పక్క రాష్ట్రాలతో తమకు పనేంటని స్వామిగౌడ్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధినేత వ్యాఖ్యలు సరికాదని అన్నారు. వార్ రూం యుద్ధాలు చేయడానికి కాదని, సమస్యలు పరిష్కరించేందుకని ఆయన చెప్పారు. యుద్ధాలు చేయాల్సి వస్తే తాము 13 ఏళ్లు ఉద్యమం చేసేవారిమే కాదని అన్నారు. తమ రాష్ట్రాన్ని తాము అభివృద్ధి చేసుకోగలమని స్వామిగౌడ్ స్పష్టం చేశారు. ఎవరి పని వారు చేసుకుంటే అందరికీ మంచిదని ఆయన ఘాటుగా స్పందించారు.

  • Loading...

More Telugu News