: భానుకిరణ్ ను చంచల్ గూడ జైలుకు మార్చిన అధికారులు
మద్దెలచెరువు సూరి హత్యకేసు ముద్దాయి భానుకిరణ్ ను చర్లపల్లి జైలు అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం మద్యం, బిర్యానీ ప్యాకెట్లు, సెల్ ఫోన్ తో జైలు ఉన్నతాధికారులుకు బ్యారెక్ లో భానుకిరణ్ పట్టుబడ్డాడు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు దీనిపై దర్యాప్తు చేశారు. తోటి ఖైదీలతో తనకు ప్రమాదం పొంచి ఉందని... తనను చంచల్ గూడ జైలుకు మార్చాలంటూ భానుకిరణ్ పెట్టిన అర్జీ మేరకు అతనిని షిఫ్ట్ చేశామని ఉన్నతాధికారులు తెలిపారు.