: రాజపక్సే వస్తే ఢిల్లీలో నిరసన చేపడతా: వైగో
మోడీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే వస్తే చూస్తూ ఊరుకోమని ఎండీఎంకే చీఫ్ వైగో అన్నారు. రాజపక్సే వస్తే అదే రోజు ఉదయం 10.30 గంటలకు జంతర్ మంతర్ వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. రాజపక్సే రాకతో కోట్లాది తమిళుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు. మరో విషయం ఏమిటంటే... ఎన్డీయేలో ఎండీఎంకే కూడా భాగస్వామే!