: గుంటూరు జిల్లాలో మద్యం లారీ బోల్తా
గుంటూరు జిల్లాలో మద్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. సత్తెనపల్లి మండలంలోని నందిగామ అడ్డరోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో, మద్యం సీసాలు రోడ్డుపై పడి పగిలిపోయాయి. సమాచారాన్ని అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని అంచనా వేస్తున్నారు.