: మజ్లిస్ పార్టీతో ఎలా పొత్తు కట్టారు?: టీఆర్ఎస్ కు కిషన్ రెడ్డి ప్రశ్న


తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన మజ్లిస్ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ను సూటిగా ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రజాకార్లతో తెలంగాణ ప్రజలను చిత్రహింసలు పెట్టిన వారితో సంబంధం ఉన్న ఎంఐఎం పార్టీతో టీఆర్ఎస్ పొత్తుపెట్టుకోవడం తమ ప్రాంత ప్రజలను కించపరచడమేనని అన్నారు. స్వాతంత్ర్యం సాధించిన తరువాత తెలంగాణ ప్రాంతాన్ని పాకిస్థాన్ లో కలపాలని, కుట్రలు, కుతంత్రాలు చేసిన మజ్లిస్ పార్టీతో టీఆర్ఎస్ కలవడం రాజకీయ అవకాశవాదం కాదా? అని ప్రశ్నించారు.

భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల విశ్వాసం లేని ఎంఐఎం పార్టీతో పొత్తును తెలంగాణ ప్రజలు స్వాగతించరని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అమాయకులైన ముస్లిం సోదరులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న పార్టీ మజ్లిస్ పార్టీ అని ఎద్దేవా చేసిన ఆయన, తెలంగాణలోని మొదటి ప్రభుత్వంతో ఎంఐఎం కలిసి పని చేయడం రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు.

  • Loading...

More Telugu News