: కాకినాడ జేఎన్టీయూ స్నాతకోత్సవంలో 28 మందికి గోల్డ్ మెడల్స్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) నాలుగో స్నాతకోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ రీసెర్చ్ అలయన్స్ అధ్యక్షుడు డాక్టర్ మశీల్ కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మశీల్ కర్ కు వైస్ ఛాన్సలర్ తులసీరామదాసు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవంలో 34 మంది విద్యార్థులకు పీహెచ్ డీ అవార్డులు, 28 మందికి బంగారు పతకాలు అందించారు.