: తన వెబ్ సైట్లో సభ్యత్వ నమోదును ప్రారంభించిన మోడీ


కాబోయే దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన వ్యక్తిగత వెబ్ సైట్లో సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ మేరకు దేశంలోని ప్రజలు, ప్రధానంగా యువత తన ఫేస్ బుక్, గూగుల్ ప్లస్ అకౌంట్స్ ద్వారా ఎప్పుడూ తనకు టచ్ లో ఉండాలని తెలిపారు. 'ఈ దేశ ప్రజలు జాతిని గొప్ప స్థాయికి తీసుకువెళతారు. ప్రపంచంలో మన జాతిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా దేశ యువత వారి శక్తిని, సామర్థ్యాన్ని, సమయాన్ని జాతికి అంకితం చేయాలి' అని ముందుమాటలో మోడీ పేర్కొన్నారు. 'ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్' కోసం తాను ఏజెంటులా ఉండాలనుకుంటున్నట్లు వెబ్ సైట్ లో ఓ సందేశాన్ని పెట్టారు.

  • Loading...

More Telugu News