: ఇటలీ మెరైన్ అధికారులపై హత్య కేసు నమోదు
ఇద్ధరు ఇటలీ మెరైన్ అధికారులపై ఎన్ఐఏ ఈ రోజు హత్య కేసు నమోదు చేసింది. భారతీయ శిక్షా స్మృతి 302 (హత్య), 307 (హత్యా ప్రయత్నం), 427 (హానీ చేయుట) వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతరం ఎఫ్ఐఆర్ ను ఢిల్లీ ప్రత్యేక కోర్టులో సమర్పించింది. భారత్ లోని ఇద్దరు కేరళ జాలర్ల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెరైన్ అధికారులు గతనెల ఇటలీ నుంచి భారత్ కు తిరిగి వచ్చారు. తక్షణమే కేంద్ర హోంశాఖ వీరి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించిన సంగతి తెలిసిందే.