: ఆమ్ ఆద్మీకి షాజియా ఇల్మీ రాజీనామా


2014 లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీలో లుకలుకలు తార స్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు షాజియా ఇల్మీ, కెప్టెన్ గోపీనాథ్ రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యం లోపించడం వల్లే తాను పార్టీ నుంచి వైదొలగినట్లు మీడియా సమావేశంలో షాజియా తెలిపారు. పార్టీలో అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకునే విధానం కూడా లేదని ఆమె ఆరోపించారు. అయితే, దేశ రాజకీయాల్లో ఆప్ పలు మార్పులు తీసుకొచ్చిందన్న ఇల్మీ అదే సమయంలో అనేక తప్పులు కూడా చేసిందన్నారు.

  • Loading...

More Telugu News