: నెల్లూరు యూనివర్శిటీ పీజీ సెట్ పరీక్షల్లో 98 శాతం ఉత్తీర్ణత
నెల్లూరు విక్రమసింహపురి యూనివర్శిటీ పీజీ సెట్ ఫలితాలను వైస్ ఛాన్సెలర్ రాజారామిరెడ్డి ఇవాళ విడుదల చేశారు. విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి గాను నిర్వహించిన ఈ పరీక్షకు 2,500 మంది హాజరయ్యారు. వీరిలో 98 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ తెలిపారు. డిగ్రీ పరీక్షా ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు.