: ఎస్పీ, జాయింట్ కలెక్టర్లతో భన్వర్ లాల్ భేటీ


రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఇవాళ విశాఖలోని కలెక్టరేట్ లో నాలుగు జిల్లాల ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాల వారీగా నమోదైన కేసులు, పట్టుబడిన నగదు, మద్యం వివరాలను ఆయా జిల్లాల అధికారులు సీఈవోకు తెలియజేశారు. ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భన్వర్ లాల్ ఆదేశించారు. అలాగే కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై దర్యాప్తు పూర్తి చేయాలని చెప్పారు. కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయాలని భన్వర్ లాల్ సూచించారు.

  • Loading...

More Telugu News