: పాక్ పీఎంను ఆహ్వానించి మోడీ విజయం సాధించారు: విదేశాంగశాఖ మాజీ మంత్రి
తన ప్రమాణస్వీకారోత్సవానికి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించి నరేంద్రమోడీ దౌత్యపరమైన సిక్సర్ కొట్టారని విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ ప్రశంసించారు. ఈ మేరకు మోడీని ఆయన అభినందించారు. మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి షరీఫ్ హజరవుతున్న సంగతి తెలిసిందే.