: భారత దౌత్య కార్యాలయంపై దాడిని ఖండించిన ఐరాస


ఆఫ్ఘనిస్తాన్ లోని భారత దౌత్య కార్యాలయంపై ఉగ్రవాదుల దాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఐరాస ఓ ప్రకటన విడుదల చేసింది. శాంతికి విఘాతం కలిగించే చర్యలకు సహాయం ఎప్పుడూ దొరకదని పేర్కొంది. పౌరులు లేదా దౌత్య ప్రతినిధులపై దాడిని తాము ఖండిస్తున్నట్లు యూఎన్ సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డ్యుజెర్రిక్ మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News