: సాహసంలోనే శ్వాస విడిచిన పశ్చిమబెంగాల్ వనిత


సాహసాన్నే ఊపిరిగా భావించింది. ఆ సాహసంలోనే ఊపిరి విడిచింది పశ్చిమబెంగాల్ కు చెందిన యువతి చందాగాయెన్. హిమాలయాలలో ఎవరెస్ట్ శిఖరం తర్వాత అత్యంత ఎత్తులో ఉన్న కాంచన్ జంగ (8,586 మీటర్లు) పర్వత శిఖరాన్ని గత ఆదివారం అధిరోహించి ఎంతో సంతోషాన్ని మనసులో మూటగట్టుకుంది. ఈ రికార్డు సాధించిన తొలి పశ్చిమబెంగాల్ మహిళ చందానే.

ఆ తర్వాత ప్రపంచంలో మూడో అతి ఎత్తయిన పర్వత శిఖరం యాలుంగ్ కాంగ్ (8,505 మీటర్లు) అధిరోహణ కోసం ఇద్దరు షెర్పాలతో కలసి వెళుతూ చందా ప్రకృతి విపత్తులో చిక్కుకుంది. ఆకస్మిక హిమపాతంతో వారు ముగ్గురూ కింద పడిపోయారు. మంచు కింద సమాధి అయ్యారని నేపాల్ లోని శంఖువసభ జిల్లా పోలీసు అధికారి కృష్ణదేవ్ తెలిపారు. వాతావరణం ప్రతికూలతతో పర్వతంపై తమ క్యాంప్ నకు తిరిగి వస్తుండగా మంగళవారం ఉదయం ప్రమాదంలో చిక్కుకుని సమాధి అయ్యారని వెల్లడించారు.

  • Loading...

More Telugu News