: మోడీకి రష్యా అధ్యక్షుడు కాల్
నరేంద్రమోడీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ కాల్ చేశారు. తిరుగులేని విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. జూలైలో జరిగే బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల కూటమి) సదస్సులో కలుసుకునేందుకు వేచి చూస్తున్నట్లు తెలిపారు. అలాగే, త్వరలో రష్యాకు విచ్చేయాలని ఆహ్వానించారు.