: బరువు తగ్గితే గుండెకు మేలండోయ్!


వయసు ఏదైనా గానీ, బరువు ఎక్కువుంటే వెంటనే తగ్గే ప్రయత్నాలు ఆరంభించండి. దాని వల్ల గుండె ఆరోగ్యం భద్రంగా ఉంటుందట. బ్రిటన్ లో స్త్రీ, పురుషులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎక్కువ కొవ్వు, అధిక బరువు ఉన్న వారు పెద్ద వయసులో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడినట్లు తేలింది. గుండె కవాటాలు మందంగా మారడం, సిస్టోలిక్ రక్తపోటు (పై స్థాయిలో ఉండేది) పెరగడం, మధుమేహం ముప్పు పెరిగినట్లు కూడా స్పష్టమైంది. అదే సమయంలో అధిక బరువును తగ్గించుకున్న వారిలో ముప్పు తగ్గినట్లు వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలు లాన్సెస్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ పత్రికలో ప్రచురితమయ్యాయి.

  • Loading...

More Telugu News