: కావాలనుకుంటే పీఎం అవుతా: రామ్ దేవ్


మంత్రి పదవిపై తనకు ఆశలేదని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. కావాలనుకుంటే తాను పార్లమెంటు సభ్యుడు, ముఖ్యమంత్రిని కాగలనన్నారు. అంతేకాదు, తాను కోరుకుంటే ఏకంగా ప్రధానమంత్రినే కాగలనని ఆయన ధీమాగా చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ టీవీ చానల్ తో మాట్లాడారు. సమర్థులు అధికారం చేపట్టడానికి వీలుగా దేశ ప్రజలు తీర్పునిచ్చారని చెప్పారు. మోడీకి బహిరంగంగా ఎన్నికల ముందు రాందేవ్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో ఆయనకు బెర్తు దక్కుతుందన్న వార్తలపై రాందేవ్ స్పందించారు. మంత్రి పదవులు కావాలనుకుంటే ఒకటే కాదు ఎన్నో వస్తాయని, కానీ తాను మంత్రి పదవిని ఆశించడం లేదనీ అన్నారు.

  • Loading...

More Telugu News