: ప్రియురాలికి తాళి కట్టి, జైలుకెళ్లిన వివాహితుడు


ఓ వివాహితుడు బుద్ధిగా కాపురం చేసుకోక మాజీ ప్రేయసి మెళ్లో తాళి కట్టి ఇప్పుడు కటకటాల వెనుక కాలక్షేపం చేస్తున్నాడు. హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన వినయ్ కుమార్ గతంలో తమ ఇంట్లో అద్దెకున్న యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. పెద్దలు అంగీకరించకపోవడంతో వేరొక యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ పాప. ఇన్నాళ్లు బుద్ధిగా ఉన్న వినయ్ కుమార్ బుర్రలో పురుగు తొలచినట్లుంది. మళ్లీ మాజీ ప్రేయసిని వెతుక్కుంటూ వెళ్లి నడిరోడ్డుపైనే శుక్రవారం తాళి కట్టాడు. మొదటి భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

  • Loading...

More Telugu News