: జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు!


బంగాళాఖాతంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇవి వాయవ్య బంగాళాఖాతం వరకూ విస్తరించాయి. దీంతో ఈ నెలాఖరుకు ఇవి కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే జూన్ 6 లోపు ఆంధ్రప్రదేశ్ లోకి ఇవి ప్రవేశిస్తాయని చెబుతున్నారు. మరోవైపు ఛత్తీస్ గఢ్ నుంచి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడతాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలియజేసింది.

  • Loading...

More Telugu News