: నన్ను భార్య అని పేర్కొనడం గర్వంగా ఉంది...పిలిస్తే వెళ్తా: మోడీ భార్య


మోడీ ఎన్నికల అఫిడవిట్లో తన పేరును భార్యగా పేర్కొనడాన్ని గర్వంగా భావించానని కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ భార్య జసోదాబెన్ పేర్కొన్నారు. ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మోడీ ఆహ్వానిస్తే ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్తానని అన్నారు. తనకు ఏ కోరికలూ లేవని తెలిపిన ఆమె, నిత్యం భగవన్నామస్మరణలో గడపడం తనకు ఇష్టమని స్పష్టం చేశారు. గత జీవితం గురించి చింతలేదని, భవిష్యత్ పై పెద్దగా ఆశలు లేవని జసోదాబెన్ తెలిపారు.

  • Loading...

More Telugu News