: తిరుమలకు పోటెత్తిన భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావటంతో తిరుమలేశుని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అలాగే కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులకు దర్శనానికి 14 సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.