: ఈ నెలాఖరున సివిల్స్ నోటిఫికేషన్ విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసులకు సంబంధించిన పరీక్షల నోటిఫికేషన్ ఈ నెల 31వ తేదీన విడుదల చేయనుంది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సర్వీసులను భర్తీ చేసేందుకు యూపీఏస్సీ ప్రతి యేటా ఈ పరీక్షలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మొదటగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూల ఆధారంగా యూపీఎస్సీ ఈ పోస్టులను భర్తీ చేస్తోంది.