: ఆంధ్ర, తెలంగాణలకు కొత్త చీఫ్ సెక్రటరీలు వస్తున్నారు


ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు కొత్తగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను వెంటనే నామినేట్ చేయాలంటూ గవర్నర్ నరసింహన్ సీఎస్ మహంతికి ఆదేశాలు జారీ చేశారు. జూన్ ఒకటో తేదీలోగా కొత్త సీఎస్ ల నియామకం పూర్తి చేయాలని గవర్నర్ చెప్పారు. చంద్రబాబు, కేసీఆర్ లను సంప్రదించి కొత్త సీఎస్ ల ఎంపిక చేయాలని గవర్నర్ సీఎస్ ను ఆదేశించారు. అలాగే తెలంగాణలో పుట్టి పెరిగిన ఐఏఎస్ లను తెలంగాణకే కేటాయించాలని కూడా గవర్నర్ పేర్కొన్నారు. 16 మంది ఐఏఎస్ అధికారులను తెలంగాణకు కేటాయిస్తూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

  • Loading...

More Telugu News