: ఆ పదవి నా సోదరుడికి ఇవ్వండి: జేసీ దివాకర్ రెడ్డి


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలను మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో కలిశారు. అనంతపురం సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్ష ఎన్నికపై చర్చించిన జేసీ, ఆ పదవిని తన సోదరుడు ప్రభాకర్ రెడ్డికి ఇవ్వాలనీ, ఇందుకు అతని పేరును పరిశీలించాలనీ సీఎంను కోరారు. మరికొన్ని రోజుల్లో ఈ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అనంతపురం జిల్లా పార్టీలో నేతల మధ్య విభేదాలు తలెత్తడంతో అధ్యక్ష పదవి కోసం పోటీ ఎక్కువైంది.

  • Loading...

More Telugu News