: గవర్నర్ నరసింహన్ ను కలిసిన కేసీఆర్
రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితం కలిశారు. జూన్ 2వ తేదీన జరిగే ప్రమాణ స్వీకారం గురించి వీరిద్దరూ చర్చించే అవకాశం ఉంది. అంతకు ముందు కేసీఆర్ తో డీజీపీ అరవిందరావు, సీఎస్ మహంతి భేటీ అయిన సంగతి తెలిసిందే.