: పోలవరంపై మూడు రాష్ట్రాల కార్యదర్శులతో సమావేశం
పోలవరం ప్రాజెక్టు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్ర కార్యదర్శులతో స్థాయి సమావేశం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి హరీష్ రావత్ తెలిపారు. పోలవరానికి సంబంధించి ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తమవద్ద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారన్నారు. అందుకే మూడు రాష్ట్రాల ప్రతినిధులతో న్యూఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.