: ఉద్యమం ఇంకా పూర్తి కాలేదు: హరీష్ రావు
తెలంగాణ ఉద్యమం ఇంకా పూర్తి కాలేదని... చేయాల్సిన పోరాటం చాలా ఉందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. బంగారు తెలంగాణ సాధించేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. పంపకాల్లో సమాన వాటా వచ్చేంత వరకు కొట్లాడతామని తెలిపారు. కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడటం సరైంది కాదని... కేసీఆర్ పై పసలేని ఆరోపణలను మానుకోవాలని సూచించారు.