: కాంగ్రెస్ ఓటమికి అధ్యక్షులే కారణం: అమరేందర్ సింగ్
పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి అధ్యక్షులే కారణమని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఆరోపించారు. చండీఘఢ్ లో ఆయన మాట్లాడుతూ, ఓటమికి కారణమైన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయిలో తిరస్కరించడానికి కారణం అధ్యక్షులేనని ఆయన అభిప్రాయపడ్డారు. అధినాయకత్వం చేసిన తప్పులే ఈ స్థాయి పరాజయాన్ని కట్టబెట్టాయని ఆయన మండిపడ్డారు.