: సీఎం గొగోయ్ వ్యతిరేక ఎమ్మెల్యేల సమావేశం
అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ వ్యతిరేక ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఓటమికి గొగోయే కారణమంటూ అసమ్మతివాదులు భేటీ అయ్యారు. దీంతో నష్ట నివారణకు తరుణ్ గొగోయ్ చర్యలు చేపట్టారు. అసమ్మతివాదులతో చర్చలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించేందుకు ఆయన సిద్ధమయ్యారు.