: కాంగ్రెస్ తప్పులకు మేం శిక్ష అనుభవించాం: శరద్ పవార్
యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులకు భాగస్వామ్యపార్టీలు శిక్ష అనుభవించాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, భాగస్వామ్య పార్టీలతో కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు మానేసిందని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన తప్పులకు యూపీఏ భాగస్వామ్య పక్షాలను కూడా ప్రజలు తిరస్కరించారని ఆయన తెలిపారు.