: 'ఇండియన్స్'కి గేల్ అడ్డుగా నిలిచాడంటున్న రికీ


రాయల్ చాలెంజర్స్  బెంగళూరుతో మ్యాచ్ లో విధ్వంసక బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ ముంబయి ఇండియన్స్ కు అడ్డుగా నిలిచాడని ఆ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ వాపోయాడు. బెంగళూరులో నిన్న జరిగిన రసవత్తర పోరులో 58 బంతుల్లో 92 పరుగులు సాధించిన గేల్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడని పాంటింగ్ కొనియాడాడు.

మ్యాచ్ అనంతరం పాంటింగ్ మాట్లాడుతూ..  'మా బౌలర్లు అతన్ని పెవిలియన్ చేర్చేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. యార్కర్లు వేశారు, ఆఫ్ స్టంప్ కు ఆవల బంతులు విసిరారు,  ఏవీ ఫలితం ఇవ్వలేకపోయాయి. ఆ ప్రయత్నంలో ఏదైనా లూజ్ బాల్ పడిందంటే సిక్స్ బాదుతున్నాడాయె' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా, నిన్న సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు పరుగుల స్వల్ప తేడాతో ముంబయిపై నెగ్గి ఊపిరి పీల్చుకుంది. చివరి ఓవర్లో 'ఇండియన్స్' విజయానికి 10 పరుగులు అవసరం కాగా ఆ జట్టు 7 పరుగులే చేసి ఓటమిపాలైంది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' క్రిస్ గేల్ కు దక్కింది. 

  • Loading...

More Telugu News